Telangana :తెలంగాణ మంత్రి వర్గ సమావేశం మార్చి 6న

తెలంగాణ మంత్రి వర్గ సమావేశం మార్చి 6వ తేదీన జరగనుంది

Update: 2025-02-28 11:52 GMT

తెలంగాణ మంత్రి వర్గ సమావేశం మార్చి 6వ తేదీన జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. అదే సమయంలో తెలంగాణా అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అమలుపై కూడా కేబినెట్ సమావేశం చర్చించనుంది.

వివిధ అంశాలపై...
దీంతో పాటు ఎస్.ఎల్.బి.సి ప్రమాదం పై చర్చించనుంది. అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై కూడా తెలంగాణ కేబినెట్ సమావేశం చర్చించనున్నట్లు తెలిసింది. ప్రధానంగా బీసీ రిజర్వేషన్లు, కులగణన సర్వేలపై కేబినెట్ చర్చించి కీలక నిర్ణయం తీసుకోనుందని అధికార వర్గాలు వెల్లడించాయి. తెలంగాణలో మెట్రో రైలు విస్తరణ పనులపై కూడా కేబినెట్ చర్చించే ఛాన్స్ ఉంది.


Tags:    

Similar News