యాదగిరిగుట్టలో చింతపండు దొంగలు.. అడ్డంగా దొరికారు
యాదగిరిగుట్టలో చింతపండు దొంగలు అడ్డంగా దొరికిపోయారు. ప్రసాదం తయారీ కేంద్రంలో చోరీకి యత్నిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
యాదగిరిగుట్టలో చింతపండు దొంగలు అడ్డంగా దొరికిపోయారు. ప్రసాదం తయారీ కేంద్రంలో చోరీకి యత్నిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. గత కొన్నాళ్లగా ప్రసాదం తయారీ కేంద్రంలో సామగ్రి మాయం అవుతూ ఉంది. అయితే ఇది ఇంటి దొంగల పనే అనే అనుమానాలు ఉన్నాయి.
వాటికి బలం చేకూరుస్తూ మంగళవారం అర్ధరాత్రి 10 బస్తాల చింతపండును దొంగతనంగా తీసుకెళ్లే క్రమంలో పోలీసులకు దొరికిపోయారు. చింతపండు బస్తాలను కన్వేయర్ బెల్టు ద్వారా బయటకు తెచ్చి కారులో తరలించడానికి యత్నం చేశారు. అదే సమయంలో పెట్రోలింగ్‌కు వచ్చిన పోలీసులను చూసిన దుండగులు కారు, చింతపండు బస్తాలను వదిలేసి పారిపోయారు.