బాబోయ్.. మార్చిలోనే ఠారెత్తిస్తున్న ఎండలు

మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయి. ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత గత రెండు రోజులుగా మరింత ఎక్కువయింది

Update: 2022-03-18 02:05 GMT

మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయి. ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత గత రెండు రోజులుగా మరింత ఎక్కువయింది. తెలంగాణలో గరిష్టంగా మార్చి నెలలోనే 43 డిగ్రీల ఉష్ఱోగ్రతలు నమోదవుతుండటం ఆందోళన కల్గిస్తుంది. మార్చిలోనే ఇలా ఉంటే మే నాటికి ఎలా ఉండగలుగుతామోనన్న భయం ప్రజల్లో కన్పిస్తుంది. ఇప్పుడే ఉదయం పది గంటలు దాటితే బయటకు రావాలంటే ప్రజలు భయపడి పోతున్నారు.

గరిష్ట ఉష్ణోగ్రతలు....
తెలంగాణలో నిన్న గరిష్టంగా పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ లో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఇక అనేక జిల్లాల్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఏపీలోనూ గుంటూరు, కృష్ణా, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో అత్యధికఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఏడాది చలి తీవ్రత ఎక్కువగానే ఉందని, అలాగే ఎండలు కూడా ఎక్కువగా ఉంటాయని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని వాతావరణ శాఖ నిపుణులు సూచిస్తున్నారు.


Tags:    

Similar News