Telangana : తెలంగాణలో నిలిచిన ఎన్నికల కోడ్

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలను నిలుపుదల చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది

Update: 2025-10-10 01:52 GMT

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలను నిలుపుదల చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. మొదటి విడత నోటిఫికేషన్ వెలువడిన కొన్ని గంటల్లోనే హైకోర్టు తీర్పు రావడంతో తొలిరోజునే నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం నిలిచిపోయింది. ఈ నెల 29వ తేదీన జారీ చేసిన నోటిఫికేషన్ ను తక్షణమే నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి నోటిఫికేషన్ వచ్చేవరకూ ఈ నామినేషన్ల ప్రక్రియ నిలిచిపోయిందని తెలిపింది. నిన్న ఉదయం ప్రారంభమయిన నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం సాయంత్రానికి నిలిచిపోయినట్లయింది.

నామినేషన్లు దాఖలయినా...
దీంతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ కూడా నిలిచిపోయిందని తెలిపింది. అయితే ఉదయం పది గంటలకు నోటిఫికేషన్ జారీ చేయడంతో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు కొన్ని చోట్ల అభ్యర్థులు నామినేషన్లు వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది జిల్లాల నుంచి జడ్పీటీసీ స్థానాలకు పదహారు నామినేషన్లు, పదహారు ఎంపీటీసీ స్థానాలకు ఇరవై ఎనిమిది జిల్లాల నుంచి 103 నామినేషన్లు దాఖలయినట్లు ఎన్నికల అధికారుల తెలిపారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని తెలిపింది.


Tags:    

Similar News