రేపు కేటీఆర్ ను విచారించనున్న సిట్
ఫోన్ ట్యాపింగు కేసులో తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు
ఫోన్ ట్యాపింగు కేసులో తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. నంది నగర్ లో కేటీఆర్ నివాసంలో నోటీసులు అందజేసిన చేసిన సిట్ అధికారులు రేపు విచారణకు రావాలని సూచించారు. రేపు ఉదయం11 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ పీఎస్‌లో సిట్ అధికారులు కేటీఆర్ ను విచారించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో...
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేయడంతో ఆయన సాయంత్రం ఆరు గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. సిరిసిల్లలో ఉన్న కేటీఆర్ నేరుగా ఎర్రవెల్లి ఫాం హౌస్ లో కేసీఆర్ ను కలసి వస్తారు. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్ రావును సిట్ అధికారులు విచారించారు. ఇక కేటీఆర్ కు నోటీసులు ఇవ్వడంతో తర్వాత కేసీఆర్ కు కూడా నోటీసులు ఇచ్చే అవకాశముంది.