నైనీ కోల్ మైన్స్ టెండర్లు రద్దు
నైనీ కోల్ మైన్స్ టెండర్ నోటిఫికేషన్ ను సింగరేణి యాజమాన్యం రద్దు చేసింది
నైనీ కోల్ మైన్స్ టెండర్ నోటిఫికేషన్ ను సింగరేణి యాజమాన్యం రద్దు చేసింది. నైనీ కోల్ మైన్స్ టెండర్స్ విషయంలో ఇటీవల తీవ్ర ఆరోపణలు ణల నేపథ్యంలో టెండర్స్ రద్దు చేస్తున్నట్లు ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించార. ఈరోజు సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభం బిడ్స్ కావాల్సి ఉండగా పాలనాపరమైన కారణాలతో టెండర్ రద్దు చేస్తున్నట్లు సింగరేణి యాజమాన్యం ప్రకటించింది. నైనీ టెండర్ల విషయంలో సింగరేణి పాలకమండలిని కేంద్ర బొగ్గు గనుల శాఖ ప్రశ్నించింది. సంస్థ విధించిన నిబంధనలపై పాలకమండలి ఎందుకు చర్చించలేదన్న సంయుక్త కార్యదర్శి సంజయ్ కుమార్ ప్రశ్నించారు.
అవినీతి ఆరోపణలపై...
చర్చించి ఉంటే టెండర్ల విషయంలో అవినీతి ఆరోపణలు ఎందుకు వస్తున్నాయన్నారు. టెండర్ వేయదలచిన కంపెనీలకు ఎందుకు సైట్ విజిట్ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం లేదనిఆయన అడిగిన ప్రశ్నికు టెండర్ల ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదని సింగరేణి అధికారులు తెలిపారు. నిబంధనలు,టెండర్లపై పాలక మండలిలో చర్చించి మరోసారి నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. నైని కోల్ మైన్స్ టెండర్ల విషయంలో తలెత్తిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలంటూ సింగరేణి యాజమాన్యాన్ని కేంద్ర బొగ్గు గనుల శాఖ కోరింది.