Telangana : విద్యార్థులకు గుడ్ న్యూస్ ....పాఠశాలలకు వరస సెలవులు
తెలంగాణలో పాఠశాల విద్యార్థులకు వరస సెలవులు రానున్నాయి. దసరా పండగకు పదమూడు రోజులు సెలవులు ప్రకటించింది
dussehra festival holidays
తెలంగాణలో పాఠశాల విద్యార్థులకు వరస సెలవులు రానున్నాయి. దాదాపు పదమూడు రోజులు సెలవులు వరసగా రానుండటంతో ఖుషీ అవుతున్నారు. ప్రభుత్వం ఈ మేరకు అధికారికంగా ప్రకటించిది. తెలంగాణ ప్రభుత్వం దసరా సెలవులను ప్రకటించింది. అక్టోబరు 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకూ పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
దసరా పండగ కావడంతో...
తెలంగాణలో దసరా అతి పెద్ద పండగ కావడంతో అధికంగా సెలవులను మంజూరు చేస్తుంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సొంత ఊళ్లకు వెళ్లి దసరా పండగ చేసుకునే అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో దసరా సెలవులు ముగిసిన తర్వాత తిరిగి అక్టోబరు 15 వతేదీ నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయని విద్యాశాఖ తెలిపింది.