Telangana : తొమ్మిదో రోజుకు సరస్వతి పుష్కరాలు

తెలంగాణలో సరస్వతి పుష్కరాలు తొమ్మిదో రోజుకు చేరుకున్నాయి. నేడు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది

Update: 2025-05-23 04:16 GMT

తెలంగాణలో సరస్వతి పుష్కరాలు తొమ్మిదో రోజుకు చేరుకున్నాయి. నేడు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. ఉన్నతాధికారులు అక్కడే ఉండి సహాయక కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.

ట్రాఫిక్ మళ్లింపు...
పుణ్యస్నానాలను ఆచరించి కాళీశ్వర ముక్తీశ్వర స్వామిని భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో ట్రాఫిక్ నుకూడా మళ్లించారు. వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటం, భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో స్నానఘట్టాల వద్ద కూడా ముందస్తు చర్యలు తీసుకున్నారు. గజఈతగాళ్లను ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News