Revanth Reddy : జులై, ఆగస్టులో హైదరాబాద్ లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు
ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశానికి కొనసాగింపుగా ప్రతి ఏడాది జూలై లేదా ఆగస్టులో హైదరాబాద్‌లో ప్రత్యేక ఫాలో-అప్ సమావేశం నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రెవంత్‌రెడ్డి ప్రతిపాదించారు
ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశానికి కొనసాగింపుగా ప్రతి ఏడాది జూలై లేదా ఆగస్టులో హైదరాబాద్‌లో ప్రత్యేక ఫాలో-అప్ సమావేశం నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రెవంత్‌రెడ్డి ప్రతిపాదించారు. దావోస్‌లో జరిగిన ‘జాయిన్ ది రైజ్’ కార్యక్రమంలో ఈ సూచనకు ప్రపంచవ్యాప్తంగా వ్యాపార నేతలు, విధాన నిర్ణేతలు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. వేగంగా మారుతున్న వ్యాపార పరిస్థితుల్లో ఏడాది గ్యాప్ ఎక్కువని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పెట్టుబడి నిర్ణయాలు త్వరగా అమలు కావాలంటే మధ్యలో మరో ఫోరం అవసరమని చెప్పారు. జూలైలో హైదరాబాద్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశం జరగేలా కలిసి ముందుకు రావాలిలని ఆయన వ్యాఖ్యానించారు.
తెలంగాణ గ్లోబల్ ఇమేజ్ ...
తెలంగాణ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పెరుగుతోందని రెవంత్‌రెడ్డి తెలిపారు. ఇటీవల జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పెద్ద విజయం సాధించిందని, రూ.5.75 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు ఆకర్షించామని చెప్పారు. సాధారణంగా డావోస్‌కు వచ్చేది ఎంవోయూలు చేసేందుకు. ఈసారి మా గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ విజయంతో, దీర్ఘకాలిక దృష్టి, విధానాలను వివరించేందుకు వచ్చామని తెలిపారు. డిసెంబర్ 2025లో భారత్ ఫ్యూచర్ సిటీలో జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అనంతరం, ప్రతిపాదిత ఫాలో-అప్ ఫోరంను హైదరాబాద్‌లో నిర్వహించడంపై ప్రపంచ ఆర్థిక వేదిక తో చర్చలు మొదలైనట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ వృద్ధి ప్రణాళిక, విజన్ 2047ను రాష్ట్రం ప్రదర్శించింది. తె