Telangana : గుడ్ న్యూస్.. నేటి నుంచి తెలంగాణలో ఇందిరమ్మ అమృత పథకం
తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేటి నుంచి మరో నూతన పథకం మొదలు పెట్టనుంది
తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేటి నుంచి మరో నూతన పథకం మొదలు పెట్టనుంది. ప్రధానంగా బాలికల కోసం ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. బాలికల్లో రక్త హీనతను నివారించేందుకు ఇందిరమ్మ అమృత పథకాన్ని నేటి నుంచి అమలు చేయనుంది. ఆరోగ్య తెలంగాణను నిర్మిద్దాం అనే నినాదంతో ఈ పథకాన్ని అమలు చేయనున్న ప్రభుత్వం పథ్నాలుగేళ్ల నుంచి పద్దెనిమిదేళ్ల వయసున్న వారికి అంగన్ వాడీ కేంద్రాల ద్వారా పల్లీ పట్టీని, చిరుధాన్యాల పట్టీని అందచేయనున్నారు.
రోజూ అంగన్ వాడీ కేంద్రాల ద్వారా...
ప్రతి రోజూ ఈ రెండు అందచేయనున్నారు. పల్లీలు, చిరుధాన్యాలు రక్తాన్ని మెరుగుపరుస్తాయని భావించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే పైలట్ ప్రాజెక్టులో భాగంగా కొన్ని జిల్లాల్లోనే ఈ పథకాన్ని నేటి నుంచి అమలు చేయనున్నారు. జయశంకర్ భూపాలపల్లి, కొమురం భీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో నేటి నుంచి ఇందిరమ్మ అమృత పథకం ప్రారంభం కానుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెంలో మంత్రి సీతక్క ఈ పధకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. అంగన్ వాడీ కేంద్రాల ద్వారా వీటిని పంపిణీ చేయనున్నారు.