Telangana : పంచాయతీ ఎన్నికలు ఎప్పుడంటే?
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమయింది
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమయింది. ఎన్నికలను మూడు విడతలుగా నిర్వహించాలని ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో త్వరలోనే పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల కానుంది. అందుతున్న సమాచారం మేరకు వచ్చే నెల 11న తొలి విడత, 15న రెండో విడత, 19న మూడో విడత ఎన్నికలను జరపాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించినట్లు తెలిసింది.
అదేరోజు ఓట్లను లెక్కించి...
అదే రోజు ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు. రాష్ట్రంలోని 31 జిల్లాలకు సంబంధించి 12,733 గ్రామ పంచాయతీలకు, 1,12,288 వార్డులకు సంబంధించి ఇప్పటికే రిజర్వేషన్లను ఖరారు చేశారు. ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్నికలకు సంబంధించి సంసిద్ధతను తెలియజేయగానే షెడ్యూల్ ను విడుదల చేసే అవకాశముంది. మరొకవైపు నేడు హైకోర్టులో స్థానిక సంస్థల ఎన్నికలపై విచారణ జరగనుంది.