రేపటి నుండి ఇంటర్ పరీక్షలు... నిబంధనలివే
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి.ఈ క్రమంలో విద్యార్థులకు రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి భారీ ఊరట కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఐదు నిమిషాలు ఆలస్యమైన పరీక్ష హలులోకి అనుమతి ఇస్తామని తెలంగాణ ఉన్నత విద్యాశాఖ అధికారులు తెలిపారు. అయితే అరగంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకుంటే మంచిదని సూచించారు.
ఐదు నిమిషాలు ఆలస్యమయినా...
సాధారణంగా హాల్ టికెట్ పై కళాశాల ప్రిన్సిపాల్ సంతకం తప్పనిసరి అనే నిబంధన ఉన్నప్పటికీ,ఈసారి విద్యార్థులు ఆన్ లైన్ నుండి డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్లపై సంతకం లేకపోయినా పరీక్షా కేంద్రంలోకి అనుమతించాలని అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.కాగా ఉదయం 09:05 అంటే ఐదు నిమిషాలు ఆలస్యం ఐనా పరీక్ష హలులోకి అనుమతిస్తామని తెలిపారు. అయితే అరగంటముందే పరీక్ష కేంద్రానికి విద్యార్థులు చేరుకోవాలని సూచించారు.