Telangana : నేడు బాల్క సుమన్ కస్టడీపై తీర్పు

క్యాతన్‌పల్లి అల్లర్ల కేసులో నేడు బాల్క సుమన్‌ను కస్టడీ పిటీషన్ పై న్యాయస్థానం తీర్పు ఇవ్వనుంది

Update: 2026-02-24 04:08 GMT

క్యాతన్‌పల్లి అల్లర్ల కేసులో నేడు బాల్క సుమన్‌ను కస్టడీ పిటీషన్ పై న్యాయస్థానం తీర్పు ఇవ్వనుంది. ఈ కేసులో విచారించేందుకు తమకు అనుమతి ఇవ్వాలని కోర్టులో పోలీసులు పిటీషన్ వేశారు. దీనిపై ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థనం నేడు తీర్పు ఇవ్వనుంది. మంచిర్యాల సెషన్స్‌ కోర్టు నేడు బాల్క సుమన్ బెయిల్ పిటిషన్‌ను విచారించనుంది.

ఆదిలాబాద్ కు కేటీఆర్...
మరొక వైపు ఆదిలాబాద్‌కు మాజీమంత్రి కేటీఆర్‌ నేడు రానున్నారు. ఆదిలాబాద్ జైలులో ఉన్న జైల్లో బాల్క సుమన్‌ను కేటీఆర్‌ పరామర్శించనున్నారు. క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మంత్రి వివేక్ కాన్వాయ్ పై దాడి చేశారన్న ఆరోపణలపై ఆయనపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేశారు. బాల్కసుమన్ ప్రస్తుతం ఆదిలాబాద్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.


Tags:    

Similar News