తెలంగాణ ప్రజలకు మోదీ ప్రత్యేక ట్వీట్

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు

Update: 2025-06-02 03:57 GMT

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. నేడు తెలంగాణ పన్నెండో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు.

జాతీయ పురోగతికి...
జాతీయ పురోగతికి తెలంగాణ కృషి చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రజల జీవన సౌలభ్యాన్ని పెంచేందుకు దశాబ్ద కాలంగా ఎన్డీఏ అనేక చర్యలు చేపట్టిందని నరేంద్ర మోదీ తెలిపారు. తెలంగాణ మరింతగా పురోభివృద్ధి చెందుతూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ లో ఆకాంక్షించారు.


Tags:    

Similar News