చంచల్ గూడ జైల్లోకి రాహుల్ కు అనుమతి

జైలులో ఉన్న NSUI నాయకులతో రాహుల్ గాంధీ 25 నిమిషాల పాటు మాట్లాడనున్నారు. కాగా.. తెలంగాణలో రాహుల్ పర్యటన నేపథ్యంలో..

Update: 2022-05-07 07:33 GMT

హైదరాబాద్ : చంచల్ గూడ జైల్లో ఉన్న ఎన్ఎస్ యూఐ అధ్యక్షుడు బలమూరి వెంకట్ సహా 17 మంది నాయకులను పరామర్శించేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి అనుమతి లభించింది. రాహుల్ తో మరొకరికి కూడా ములాఖత్ కు అనుమతినివ్వగా.. రేవంత్ లేదా మాణిక్యం ఠాకూర్ రాహుల్ తో వెళ్లనున్నట్లు సమాచారం. మధ్యం ఒంటిగంట 5 నిమిషాల నుంచి 1.30 నిమిషాల వరకూ ములాఖత్ కు అనుమతి ఇచ్చింది చంచల్ గూడ జైలు శాఖ. రాహుల్ రాక నేపథ్యంలో చంచల్ గూడ జైలు వద్ద భారీ పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశారు

జైలులో ఉన్న NSUI నాయకులతో రాహుల్ గాంధీ 25 నిమిషాల పాటు మాట్లాడనున్నారు. కాగా.. తెలంగాణలో రాహుల్ పర్యటన నేపథ్యంలో ఉస్మానియా విద్యార్థులతో రాహుల్ మాట్లాడేందుకు అనుమతినివ్వాల్సిందిగా కొద్దిరోజులుగా కాంగ్రెస్ ఓయూ వీసీని కోరుతూ వచ్చింది. కానీ వీసీ అనుమతి నిరాకరించడంతో.. హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు కూడా వీసీనే అడగాలని సూచించింది. రాహుల్ తో భేటీకి అనుమతి నిరాకరించడంతో ఎన్ఎస్ యూఐ నాయకులు వీసీ ఛాంబర్ ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో జరిగిన వివాదంపై 8సెక్షన్ లా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి, అరెస్ట్ చేసి చంచల్ గూడ జైలుకు తరలించారు. వారంరోజులుగా వారంతా జైల్లోనే ఉండగా.. ఇప్పటి వరకూ జరిగిన పరిణామాలను అడిగి తెలుసుకునేందుకు రాహుల్ ఎన్ఎస్ యూఐ నేతలను కలవనున్నారు.



Tags:    

Similar News