బాదుడుపై నిరసనగా?

పేదల్ని దోచుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు

Update: 2022-03-26 13:20 GMT

పేదల్ని దోచుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఒకరు పెట్రోలు, గ్యాస్ పై ధరలు పెంచుతుండగా, ఇక్కడ విద్యుత్తు ఛార్జీలను పెంచి పేద ప్రజల నడ్డివిరస్తున్నారన్నారు. ఇద్దరి తప్పులు కప్పి పుచ్చుకునేందుకు ఒకరిపై ఒకరు పోరాటాలు చేస్తున్నట్లు నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చి విద్యుత్తు ఛార్జీల పెంచి ఐదు వేల కోట్లు, సర్ ఛార్జిల పేరుతో ఆరు వేల కోట్లు ప్రజలపై భారం మోపిందన్నారు. ప్రభుత్వం విద్యుత్తు సంస్థలకు చెల్లించాల్సిన బకాయీ కూడా చెల్లించడం లేదన్నారు.

వరస ఆందోళనలతో....
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల వరకూ పెట్రోలు, గ్యాస్ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచలేదని, ఫలితాలు వెలువడగానే బాదుడు మొదలు పెట్టిందని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. పెంచిన గ్యాస్, పెట్రోలు ధరలకు నిరసనగా కాంగ్రెస్ ఉద్యమిస్తుందని రేవంత్ రెడ్డి తెలిపారు. మార్చి 31న సిలిండర్లకు దండలు వేసి డప్పు చాటింపు వేయిస్తామన్నారు. ఏప్రిల్ 4 విద్యుత్తు ఛార్జిల పెంపుదల నిరసనగా ఏఈ, డీఈ కార్యాలయాలను ముట్టడిస్తామన ిచెప్పారు. ఏప్రిల్ 4న మండల కేంద్రాల్లో నిరస, 5న కలెక్టర్ కార్యాలయాల ఎదుట ఆందోళనకు దిగుతామని రేవంత్ర ెడ్డి తెలిపారు.


Tags:    

Similar News