స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండండి
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పంచాయతీ రాజ్ శాఖ అన్ని జిల్లాల పంచాయతీ, జిల్లా పరిషత్ సీఈవోలకు ఆదేశాలు జారీ చేసింది
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పంచాయతీ రాజ్ శాఖ అన్ని జిల్లాల పంచాయతీ, జిల్లా పరిషత్ సీఈవోలకు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు సెప్టంబరు చివరి నాటికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు ఉన్నాయని, వాటిని అమలు చేయాలంటే ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధమవ్వాలని ఆదేశాలు జరాీ చేశారు.
సెప్టంబరు నెలాఖరులోగా...
ఎన్నికలకు సంబంధించిన సామగ్రిని సిద్ధం చేసుకోవాలని కూడా సూచించారు. తెలంగాణలో 31 జడ్పీటీసీ, 566 జడ్పీటీసీ, 5,773 ఎంపీటీసీ స్థానాలనున్నాయని, అలాగే 12,778 గ్రామప పంచాయతీలు ఉండగా, అందులో 1.12 లక్షల వార్డులుండగా అన్నింటికీ ఎన్నికలు జరిపేందుకు అవసరమైన సామగ్రిని ఇప్పటి నుంచే సిద్ధం చేసుకోవాలని సూచించింది. బ్యాలట్ బాక్సులతో పాటు బ్యాలట్ పత్రాలను కూడా అంతా సిద్ధం చేసుకుని ఒకసారి సరిచూసుకునేందుకు సిద్ధమవ్వాలని, రెండురోజుల్లో సమావేశాన్ని ఏర్పాటు చేసి పూర్తి స్థాయి ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొంది.