Telangana : కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే
తెలంగాణ కాంగ్రెస్ లో ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేశారు.
caste enumeration in telangana
తెలంగాణ కాంగ్రెస్ లో ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేశారు. అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతిలకు ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపిక చేశారు. ఈ మేరకు అధినాయకత్వం డిసైడ్ చేసి ప్రకటన చేసింది. తమ మిత్రపక్షంగా ఉన్నసీపీఐకి కూడా ఒక స్థానం కేటాయించడంతో మూడు స్థానాలకు మాత్రమే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ముగ్గురిని ఎంపిక చేసిన...
అద్దంకి దయాకర్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అనంతరం పదేళ్ల నుంచి కాంగ్రెస్ విజయం కోసం కృషి చేశారు. కెతవాత్ శంకర్ నాయక్ సుదీర్ఘంగా కాంగ్రెస్ లోనే ఉన్నారు. విజయశాంతి గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లోకి వచ్చినా పార్టీ అభ్యర్థుల విజయంకోసం పనిచేశారు. దీంతో ముగ్గురిని ఎంపిక చేశారు. దీంతో ఈ ముగ్గురు నేడు ఎమ్మెల్సీలుగా నామినేషన్లు వేయనున్నారు.