It Raids : హైదరాబాద్‌లో మరోసారి ఐటీ రైడ్స్.. రాజకీయ నేతలే లక్ష్యంగా

హైదరాబాద్ లో మరొకసారి ఈరోజు తెల్లవారుజాము నుంచి ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు

Update: 2023-11-02 03:03 GMT

హైదరాబాద్ లో మరొకసారి ఈరోజు తెల్లవారుజాము నుంచి ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస పార్టీలలో టిక్కెట్ ఆశిస్తున్న వారి ఇళ్లలో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. .మహేశ్వరం కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఆయన ఇల్లు, కార్యాలయంలో కూడా ఈ సోదాలు జరుగుతున్నాయి.

కాంగ్రెస్ అభ్యర్థి...
అలాగే మహేశ్వరం కాంగ్రెస్ టికెట్ ఆశించిన పారిజాతం ఇంట్లో కూడ ఐటీ సోదాలు జరుగుతున్నాయి. బాలాపూర్ లోని ఆమె ఇంటితో పాటు పది చోట్ల ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు.బాలాపూర్ లో లడ్డు వేలంలో దక్కించుకున్న వంగటే లక్ష్మారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. పలువురు రాజకీయ నేతల ఇళ్లలో సోదాలు జరుగుతుండటంతో ఎన్నికల వేళ తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది.


Tags:    

Similar News