ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నేటితో ముగియనున్న ప్రచారం

ఈ నెల 27వతేదీన పట్టబద్రుల ఎమ్మెల్సీ స్దానానికి ఎన్నికలు జరగనున్నాయి.

Update: 2024-05-25 05:42 GMT

ఈ నెల 27వతేదీన పట్టబద్రుల ఎమ్మెల్సీ స్దానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు ఎన్నికల ప్రచారం ముగియనుంది.ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగర్ జిల్లాల పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి, బిజెపి నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి లు పోటిలో ఉన్నారు.

నేటి నుంచి మద్యం దుకాణాల బంద్...
ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రచారాన్నిి తీవ్రంగాచేశారు. ఉమ్మడి మూడు జిల్లాల్లో ఓటు వేసే పట్టబద్రుల ఉద్యోగులకు ప్రత్యేక క్యాజువల్ లీవ్ ఇవ్వాలని ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజు ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణలో నేటితో పట్టభద్రుల ఎమ్మెల్సీ ప్రచారం ముగియనుండటంతో చివరి సారిగా తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అగ్రనేతలు రంగంలోకి దిగారు. నేటి సాయంత్రం నుంచి మూడు నియోజకవర్గాల పరిధిలో మద్యం దుకాణాలు బంద్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.


Tags:    

Similar News