Telangana : నేటితో ముగియనున్న నామినేషన్ల గడువు
తెలంగాణ తొలిదశ పంచాయతీఎన్నికలకు భారీగా నామినేషన్లు దాఖలవుతున్నాయి
తెలంగాణ తొలిదశ పంచాయతీఎన్నికలకు భారీగా నామినేషన్లు దాఖలవుతున్నాయి. ఇప్పటివరకు సర్పంచ్ పదవులకు 8,198 నామినేషన్లు దాఖలయినట్లు అధికారులు తెలిపారు. వార్డులకు ఇప్పటివరకు 11,502 నామినేషన్లు దాఖలయ్యాయి. నేటితో ముగియనున్న తొలి విడత నామినేషన్ల గడువు ముగియనుండటంతో ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యే అవకాశముంది.
తొలి దశ ఎన్నికలకు...
ఈ నెల 27వ తేదీన ప్రారంభమైన నామినేషన్లకు తొలిదశలో భారీగానే నామినేషన్లు దాఖలయ్యాయి. తొలి దశ ఎన్నికలు 189 మండలాల్లోని 4,236 సర్పంచ్ స్థానాలకు, 37,440 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. 30వ తేదీన నామినేషన్ల స్క్కూటినీ చేపడతారు. డిసెంబరు 1వ తేదీన అభ్యంతరాలను స్వీకరిస్తారు. 2వ తేదీన పరిష్కరిస్తారు. మూడో తేదీ నామినేషన్ల ఉప సంహరణకు గడువు ముగియనుంది. మూడో తేదీ అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేస్తారు. డిసెంబరు 11న పోలింగ్ జరగనుంది. అదే రోజు ఉప సర్పంచ్ ఎన్నికతో పాటు ఎన్నికల ఫలితాలను కూడా వెల్లడించనున్నారు.