నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది.

Update: 2025-08-09 03:11 GMT

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. భారీ వర్షాలతో పాటు పైన ప్రాజెక్టుల నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తుండటంతో సాగర్ కు జలకళ సంతరించుకుంది. అయితే పూర్తిగా నాగార్జున సాగర్ నిండకపోవడంతో గేట్లను అధికారులు ఇంకా తెరవలేదు. వాతావరణ శాఖ ఇంకా మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని చెప్పడంతో సాగర్ కు మరింత వరద నీరు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నార.

నీటిమట్టం...
నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 63,571 కాగా, ఔట్‌ఫ్లో 43,554 క్యూసెక్కులుగా ఉందని నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుపూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 589 అడుగులుగా ఉంది. ఇంకా ఒక అడుగు నిండితే పూర్తి స్థాయిలో ప్రాజెక్టు నిండుతుందని, అప్పుడు గేట్లు తెరిచే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.


Tags:    

Similar News