కోమటిరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి తన మంత్రి పదవిపై సంచలన వ్యాఖ్యలు చేశారు
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి తన మంత్రి పదవిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రిపదవి ఇస్తే తప్పేంటి? అని ప్రశ్నించారు. తొమ్మిది మంది ఎమ్మెల్యేలున్న ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు కేబినెట్ లో ఉండగా, పదకొండు మంది ఎమ్మెల్యేలు గెలిచిన నల్లగొండ జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉంటే తప్పేమిటని ప్రశ్నించారు.
ఇద్దరం ఉంటే...
ఇద్దరం అన్నదమ్ములు అయితే మంత్రివర్గంలో చేరకూడదా? అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తే తప్పేమిటని నిలదీశారు.తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నది ఎవరన్నది తెలియాలని ఆయన కోరారు. తనకు మంత్రిపదవి ఇస్తామని హామీ ఇచ్చినప్పుడు తామిద్దరంఅన్నదమ్ములమని తెలియదా? అని ప్రశ్నించారు.