సింగరేణి జోలికి వస్తే ఊరుకోం

సింగరేణిని ప్రయివేటు పరం చేస్తే ఊరుకునేది లేదని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు

Update: 2022-02-07 08:33 GMT

సింగరేణిని ప్రయివేటు పరం చేస్తే ఊరుకునేది లేదని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. తెలంగాణకు ప్రతిష్టాత్మకమైన సింగరేణి సంస్థను ప్రయివేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందని కేటీఆర్ అన్నారు. సింగరేణి జోలికి వస్తే ఢిల్లీ తల్లడిల్లాల్సిందేనని కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. సింగరేణి జోలికి వస్తే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరో ఉద్యమం తప్పదని ఆయన హెచ్చరించారు.

ప్రయివేటు పరం చేయాలని....
సింగరేణిని ప్రయివేటు పరం చేయాలని చూస్తే యావత్ తెలంగాణ సమాజం బీజేపీని సమాధి చేస్తుందన్నారు. నల్లబంగారంపై కేంద్ర ప్రభుత్వం కన్నేసిందన్నారు. సింగరేణిని దెబ్బతీస్తే చూస్తూ ఊరుకోబోమని చెప్పారు. ఈ విషయంలో తాము సింగరేణి కార్మికులకు అండగా నిలబడతామని చెప్పారు.


Tags:    

Similar News