కవిత వారితో కలసి తిరుమల ఎందుకు వెళ్లారు?

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితులు రామచంద్రన్ పిళ్లైతో కలసి కల్వకుంట్ల కవిత తిరుమల ఎందుకు వెళ్లారని ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు

Update: 2022-09-07 06:56 GMT

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితులు రామచంద్రన్ పిళ్లైతో కలసి కల్వకుంట్ల కవిత తిరుమల ఎందుకు వెళ్లారని ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు. కవిత వాళ్లతో ఎందుకు ఉన్నారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా తిరుమలలో ప్రత్యేక పూజలు చేయించడానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెళ్లారన్నారు. వారితో పాటు ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితులు రామచంద్రన్ పిళ్లై, అభిషేక్ రావులు కూడా వెళ్లారని ఆయన ఫొటోలు మీడియా ముందు ఉంచారు. లిక్కర్ కుంభకోణంలో సంబంధం లేకపోతే వీరంతా తిరుమలకు ఎందుకు వెళ్లి వచ్చారని ఆయన ప్రశ్నించారు. తమ పార్టీ ఎంపీల ఆరోపణలను ఖండించిన కవిత దీనికి సమాధానం చెప్పాలని రఘునందనరావు నిలదీశారు.

ఈటలపై అంత రాద్ధాంతమా?
శాసనమండలిలో ఆరు గంటలు చర్చ జరిగితే శాసనసభ ఆరు నిమిషాల్లోనే ఎందుకు ముగించారని ఆయన ప్రశ్నించారు. మరణించిన మాజీ శాసనసభ్యులకు సంతాపం తెలిపిన వెంటనే సభను ఎందుకు వాయిదా వేయాల్సి వచ్చిందని ఆయన నిలదీశారు. ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను రాద్ధాంతం చేస్తున్నారన్నారు. నిజామాబాద్ కు ముఖ్యమంత్రి వచ్చినప్పుడు స్పీకర్ కు గౌరవం ఇవ్వంది మీరు అంటూ టీఆర్ఎస్ నేతలపై రఘునందన్ రావు మండి పడ్డారు. అధికార పార్టీ ఇచ్చే నోటీసులకు సరైన సమాధానం చెబుతామని తెలిపారు. ఈటల రాజేందర్ సభలో ఉన్నందునే ఆయన కేసీఆర్ సభను వాయిదా వేయించారన్నారు.


Tags:    

Similar News