Telangana : బస్సు ప్రమాదంపై సీసీ టీవీ ఫుటేజీలో షాకింగ్ విజువల్స్

తెలంగాణలోజరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదానికి సంబంధించి సీసీటీవీ వీడియో బయటపడింది.

Update: 2025-11-03 06:31 GMT

తెలంగాణలోని చెవెళ్ల మండలం మిర్జాగూడ సమీపంలో సోమవారం ఉదయం జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదానికి సంబంధించి సీసీటీవీ వీడియో బయటపడింది. ఈ దృశ్యాల్లో ప్రమాదానికి ముందు జరిగిన పరిణామాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాండూర్ డిపోకు చెందిన బస్సు తెల్లవారుజామున బయలుదేరి, ఉదయం ఐదు గంటలకు వికారాబాద్ వద్ద ప్రయాణికులను ఎక్కించుకుంది. తర్వాత ఉదయం ఆరు గంటలకు చెవెళ్ల బస్టాండ్‌కు చేరుకుని హైదరాబాద్ వైపు ప్రయాణాన్ని ప్రారంభించింది.

అదే కారణం...
అయితే ఉదయం 6.15 గంటల నుంచి 6.20 గంటల మధ్యలో మిర్జాగూడ వద్ద కంకరతో లోడ్‌ చేసిన లారీ బస్సును ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే పలువురు ప్రయాణికులు మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం సమయంలో బస్సులో దాదాపు 72 మంది వరకూ ఉన్నారని పోలీసు అధికారులు తెలిపారు. అత్యవసర సేవా బృందాలు, పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యం ప్రధాన కారణాలుగా అనుమానిస్తున్నారు.


Tags:    

Similar News