Telangana : రెండు కోట్లు ఇచ్చిన ఎమ్మెల్యే.. యూరియా కొరత తీర్చేందుకు

మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ముఖ్యమంత్రి సహాయనిధికి రెండు కోట్ల రూపాయలు అందచేశారు

Update: 2025-09-18 05:40 GMT

మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ముఖ్యమంత్రి సహాయనిధికి రెండు కోట్ల రూపాయలు అందచేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి రెండు కోట్ల రూపాయల చెక్కును ఇచ్చారు. తన నియోజకవర్గంలో యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, వారికి యూరియా కొరత లేకుండా తగిన చర్యలు తీసుకునేలా ముఖ్యమంత్రి ఈ నిధులను వినియోగించాలని కోరానని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తెలిపారు.

తన కుమారుడు వివాహ రిసెప్షన్ కోసం...
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్లమెంటు సభ్యుడు కలిసి ఈ నిధులను సద్వినియోగం చేయడం గురించి ఆలోచించాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కోరారు. అంతేకాకుండా తన కుమారుడు వివాహ రిసెప్షన్ కోసం కేటాయించిన రెండు కోట్ల రూపాయలను తన నియోజకవర్గంలోని రైతుల ఇబ్బందులు తొలగించేలా చర్యలు తీసుకోవాలనే తాను ముఖ్యమంత్రికి ఇచ్చానని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తెలిపారు.


Tags:    

Similar News