Telangana : నేడు కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికపై నిపుణలతో మంత్రి ఉత్తమ్ భేటీ
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికపై నేడు అధ్యయన కమిటీ సభ్యులతో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమవుతున్నారు
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికపై నేడు అధ్యయన కమిటీ సభ్యులతో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమవుతున్నారు. ఇప్పటికే కమిషన్ ఇచ్చిన నివేదికను అధ్యయనం చేయడానికి అధ్యయన కమిటీని నిపుణులతో ప్రభుత్వం నియమించిన సంగతి తెలసిందే.వారితో సమావేశమై ఉత్తమ్ నేడు చర్చించనున్నారు.
రేపు మంత్రి వర్గ సమావేశంలో...
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి, అక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నియమించిన నేపథ్యంలో ఆయన నివేదికలో పొందు పర్చిన రిమార్క్ లను నిపుణులతో చర్చించనున్నారు. రేపు జరగనున్న తెలంగాణ మంత్రి వర్గ సమావేశంలో దీనిపై చర్చించేందుకు నేడు మంత్రి ఉత్తమ్ నిపుణులతో సమావేశమవుతున్నారు.