Komatireddy Venkatareddy : కేటీఆర్ పై కోమటిరెడ్డి ఫైర్
మూసీ ప్రక్షాళన చేస్తే నల్లగొండ జిల్లా బాగుపడుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు
komatireddy venkatareddy
మూసీ ప్రక్షాళన చేస్తే నల్లగొండ జిల్లా బాగుపడుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ మూసీపై కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. నల్లగొండ ప్రజలను రెచ్చ గొట్టవద్దంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాజీ మంత్రి కేటీఆర్ ను హెచ్చరించారు. మూసీని ప్రక్షాళన చేస్తామంటే కేటీఆర్ కు ఏం నొప్పి అని ఆయన ప్రశ్నించారు. కావాలని ప్రజలను రెచ్చగొట్టి మూసీ ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
ప్రజలు తిరగబడతారంటూ...
అదే జరిగితే నల్లగొండ ప్రజలు కేటీఆర్ పై తిరగబడతారని అని అన్నారు. బీఆర్ఎస్ ను తరిమి కొడతారని అన్నారు. మూసీ ప్రాజెక్టును చేపట్టింది స్వార్థ ప్రయోజనం కోసం కాదని, ప్రజాప్రయోజనం కోసమేనని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. దానిని గుర్తించకుండా రాజకీయ ప్రయోజనాల కోసమే బీఆర్ఎస్ నేతలు డ్రామాలకు తెరలేపారన్నారు. పదేళ్లు తెలంగాణ ఉద్యానికి దూరంగా ఉండి కేటీఆర్ విదేశాల్లో ఉండి వచ్చి ఇక్కడ కోట్లు సంపాదించి ప్రజల గోడు పట్టడం లేదని ఆయన ఆరోపించారు.