Telanana : ఈ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్.. జాగ్రత్తగా ఉండాల్సిందే
తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణ, మహారాష్ట్ర పరిసరాల్లో అల్పపీడనం బలహీనపడిందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని చెప్పింది. దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని చెప్పింది. కోస్తాంధ్రలో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు పడతాయని, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాలకు వర్షసూచన చేసింది. తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణలోని
జగిత్యాల, మంచిర్యాల, మెదక్‌కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే పెద్దపల్లి, సంగారెడ్డి,వికారాబాద్‌కు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. వీటి ప్రభావంతో ఈ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వల్లడించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో పాటు ఆదిలాబాద్, హైదరాబాద్, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్,కొమురంభీం, మేడ్చల్, నిర్మల్,నిజామాబాద్, సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు హైదరాబాద్ వాతవరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీచేసింది. ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసే అవకాశముందని కూడా తెలిపింది.