తెలంగాణలో కరోనా సునామీ.. వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరిక

తెలంగాణలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉందని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది

Update: 2022-01-19 07:00 GMT

తెలంగాణలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉందని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఇటీవల ఆశావర్కర్లు సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో ఆసక్తికరమైన విషయలు వెలుగు చూశాయి. తెలంగాణ వ్యాప్తంగా ఇరవై లక్షల మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు కనుగొన్నారు. వీరంతా జలుబు, దగ్గుతో బాధపడుతున్నారు.

గ్రేటర్ లో....
ఒక్క గ్రేటర్ హైదరాబాద్ లోనే పదిహేను లక్షల మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు తేలింది. రాబోయే రెండు వారాల్లో మరిన్ని కేసులు పెరిగే అవకాశముందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని, తగిన చర్యలతో పాటు ఆంక్షలను కఠినతరం చేయాలని నివేదికలో పేర్కొంది.


Tags:    

Similar News