యాదగిరిగుట్టలో మహాకుంభాభిషేక సంప్రోక్షణ

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రంలో మహాకుంభాభిషేక సంప్రోక్షణ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి

Update: 2025-02-22 02:56 GMT

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రంలో మహాకుంభాభిషేక సంప్రోక్షణ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం దివ్య స్వన్ణ విమాన గోపురాన్ని స్వామి వారికి అంకితం చేయనున్నారు. ఆదివారం జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరవుతున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా ఆహ్వానం అందించారు.

జీయర్ స్వామి పర్యవేక్షణలో...
రామానుజ జీయర్ స్వామి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ మహా సంప్రోక్షణకు నలభై జీవ నదుల నుంచి జలాలను సేకరించారు. ఆదివారం ముగింపు కార్యక్రమం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు హాజరు కానున్నారు. 68 కిలోల బంగారం తో స్వర్ణ విమాన గోపురాన్ని తయారు చేశఆరు. 2024 డిసెంబరు 1వ తేదీన తాపడం పనులు ప్రారంభించగా నేటికి పూర్తయింది.


Tags:    

Similar News