వరస రాజీనామాలు.. కారు పార్టీకి ఇబ్బంది

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు అధికార టీఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగా మారాయి.

Update: 2021-11-26 02:15 GMT

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు అధికార టీఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగా మారాయి. ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న వారికి ఈసారి కూడా పదవులు దక్కకపోవడంతో వారు రాజీనామాల బాట పట్టారు. మరో రెండేళ్లలో శాసనసభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో వరస రాజీనామాలు టీఆర్ఎస్ ను ఇబ్బంది పెట్టేలా ఉన్నాయి.

ఇద్దరు నేతలు....
పార్టీలో సీనియర్ నేత గట్టు రామచంద్రరావు ఎమ్మెల్సీ పదవిని ఆశించారు. ఆయనకు పదవి దక్కకపోవడంతో రాజీనామా చేశారు. ఇక కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ కూడా పార్టీకి రాజీనామా చేశారు. ఆయన కూడా ఎమ్మెల్సీ పదవిని ఆశించారు. ఇటీవల ఎమ్మెల్యే కోటాలో, స్థానిక సంస్థల ఎన్నికల కోటాలో మొత్తం 18 ఎమ్మెల్సీ స్థానాలను కేసీఆర్ భర్తీ చేశారు. దీనిపై అసంతృప్తి చెందిన నేతలు రాజీనామా బాట పడుతున్నారు.


Tags:    

Similar News