ముహూర్తాల విషయం లో ఆచి తూచి

తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి సందడి మొదలైంది. త్వరలోనే శ్రావణ మాసం రానుండడంతో మంచి ముహూర్తాలున్నాయి.

Update: 2025-07-12 13:30 GMT

తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి సందడి మొదలైంది. త్వరలోనే శ్రావణ మాసం రానుండడంతో మంచి ముహూర్తాలున్నాయి. ఇవి దాటిపోతే మళ్లీ కార్తిక మాసంలోనే వివాహాలకు మంచి ఘడియలున్నాయి. అయితే డిసెంబరు నుంచి 2026 ఫిబ్రవరి మొదటి వారం దాకా శుక్ర మూఢం కారణంగా ముహూర్తాలు లేవని పురోహితులు చెబుతున్నారు. ఈ ఏడాది డిసెంబరులోగా కేవలం జులై, ఆగస్టు, అక్టోబరు, నవంబరులలో మాత్రమే పెళ్లిళ్లకు ముహూర్తాలు ఉన్నాయి. ఇవి దాటి పోతే వచ్చే ఏడాది దాకా ఎదురుచూడాల్సిందేనని అంటున్నారు. ముహూర్తాలు తక్కువగా ఉన్నందున త్వరగా పెళ్లి కుదుర్చుకోవాలనుకునే తల్లిదండ్రుల సంఖ్య బాగా పెరిగింది. ఇక స్వదేశంలో ఉద్యోగాలున్నవారికి సంబంధాలు త్వరగా కుదరడం ఇటీవల బాగా పెరిగింది.

Tags:    

Similar News