KTR : నేడు నిర్మల్ నేతలతో కేటీఆర్ భేటీ
నేడు నిర్మల్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ భేటీ కానున్నారు.
నేడు నిర్మల్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ భేటీ కానున్నారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతంపై చర్యలు తీసుకోనున్నారు. ఉదయం 11:30 గంటలకు తెలంగాణ భవన్‌లో సమావేశం జరగనుంది. ఇప్పటికే నిర్మల్ నియోజకవర్గానికి సంబంధించి నేతలకు ఆహ్వానం అందింది. నేతలతో పాటు ముఖ్య కార్యకర్తలకు కూడా ఆహ్వానం పంపారు.
పార్టీ బలోపేతంపై...
నియోజకవర్గంలో ప్రధాన సమస్యలతో పాటు రానున్న కాలంలో భవిష్యత్ కార్యాచరణపై కేటీఆర్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా పాలన సాగిస్తుండటంతో పాటు ఇచ్చిన 420 హామీలను గుర్తు చేస్తూ నియోజకవర్గంలో కార్యక్రమాలను నిర్వహించాలని నేతలకు కేటీఆర్ సూచించనున్నారు.