నేడు కృష్ణా నది యాజమాన్యం బోర్డు సమావేశం జరగనుంది. ఈ కేఆర్‌ఎంబీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. కేఆర్ఎంబీ చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన బోర్డు భేటీ జరగనుంది. సాగర్ వివాదం, నీటి వినియోగంపై చర్చ జరుగుతుంది. కృష్ణాజలాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా తరలిస్తోందని తెలంగాణ ఆరోపిస్తుంది.
తెలంగాణ ఫిర్యాదుతో...
ఇప్పటికే మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫిర్యాదు కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదులపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి వాటాలపై కూడా చర్చించే అవకాశముంది. దీంతో పాటు రానున్న వేసవిలో విద్యుత్తు ఉత్పత్తి, సాగునీరు వంటి అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చకు రానుంది.