Telangana : ఇక బీసీలకు పదవులే పదవులు... రిజర్వేషన్లకు ఆమోదం

తెలంగాణ మంత్రి వర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించింది.

Update: 2025-07-11 01:56 GMT

తెలంగాణ మంత్రి వర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు పర్చాలని మంత్రి వర్గంలో సుదీర్ఘంగా చర్చించి ఓకే చేశారు. వర్షాకాల సమావేశాలను నిర్వహించే తేదీలపై కూడా మంత్రి వర్గ సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతుండటంతో బీసీలకు 42 శాతం రిజ్వేషన్ కల్పిందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది.

సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా...
కేబినెట్ సమావేశంలో బీసీ రిజర్వేషన్లకు మంత్రి వర్గం ఆమోదించింది. సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా ఇప్పటికే బీసీ డెడికేటెడ్ కమిషన్ ను నియమించింది. కులగణనను కూడా చేపట్టింది. ప్రభుత్వం వద్ద ఉన్న డేటా ఆధారంగా జనాభా ప్రకారం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించింది. అయితే బీసీ రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు పంచాయతీ సర్పంచ్ లకు గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ సభ్యులకు మండలం, ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యులకు జిల్లా, జడ్పీ ఛైర్మన్లకు రాష్ట్రం యూనిట్ గా పరిణించనున్నారు. బీసీ రిజర్వేషన్లు పెంపునకు అనుగునగా పంచాయతీ రాజ్ చట్టంలో మార్పులు చేయాలని, సవరణలకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
మార్చి లోపు లక్ష ఉద్యోగాలు...
నాలుగు గంటల పాటు జరిగిన సమావేశంలో ప్రధానంగా బీసీ రిర్వేషన్లపైనే మంత్రివర్గంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు మరికొన్ని కీలక నిర్ణయాలను కూడా తీసుకున్నారు. ఉద్యోగాల కల్పనలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని, త్వరలోనే మరో పదిహేడు వేల ఉద్యోగలకు సంబంధించిన నియామక ప్రక్రియ వివిధ దశల్లో ఉందని మంత్రులు తర్వాత జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు. ఇప్పటికే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అరవై వేల ఉద్యోగాలు ఇచ్చామని, ఇంకా22 వేల కొలువులకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. మార్చిలోపు లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న మాటను నిలబెట్టుకుంటామని చెప్పారు.


Tags:    

Similar News