KCR : ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ఎదుటకు

ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ బయలుదేరారు. 11.30 గంటలకు బీఆర్కే భవన్ కు చేరుకుంటారు.

Update: 2025-06-11 04:42 GMT

ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ బయలుదేరారు. 11.30 గంటలకు బీఆర్కే భవన్ కు చేరుకుంటారు. కాళేశ్వరం కమిషన్ ఎదుటకు హాజరవుతారు. కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు కేసీఆర్ తో పాటు తొమ్మిది మందికి లోపలికి అనుమతించారు. వారిని మాత్రమే అనుమతిస్తారు. మిగిలిన వారిని ఎవరినీ అనుమతించరు. కేసీఆర్ రాక సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

బీఆర్కే భవన్ వద్దకు...
బీఆర్కే భవన్ వద్దకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. కేటీఆర్ ఎమ్మెల్యే క్వార్టర్ లోనే ఉండి అక్కడి పరిస్థితులను సమీక్షిస్తున్నారు. బీఆర్కే భవన్ కు వచ్చే పార్టీ కార్యకర్తలకు ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. కేసీఆర్ వెంట హరీశ్ రావు, కల్వకుంట్ల కవిత, సంతోష్ రావు, ప్రశాంత్ రెడ్డి తదితరులు బయలుదేరి వచ్చారు.


Tags:    

Similar News