కేసీఆర్ చుట్టూ బీహారీ కోటరీయే

కేసీఆర్ బీహార్ అధికారులను తన కోటరీలో పెట్టుకుని పాలన సాగిస్తున్నారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు

Update: 2022-03-02 08:05 GMT

కేసీఆర్ బీహార్ అధికారులను తన కోటరీలో పెట్టుకుని పాలన సాగిస్తున్నారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ధరణి పోర్టల్ ను అడ్డం పెట్టుకుని నిజాం కాలం నాటి భూములను కాజేయాలన్న ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిచంారు. కేటీఆర్ ఆత్మ జయేష్ రంజన్ కూడా బీహార్ కు చెందిన వారేనన్నారు. అరవింద్ కుమార్ కూడా బీహారీయేనని తెలిపారు. చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్, డీజీపీ అంజనీకుమార్ లతో పాటు బీహార్ కు చెందిన అధికారులకు పెద్దపీ వేస్తున్నారన్నారు. 139 మంది ఐపీఎస్ లలో డీజీపీ పోస్టుకు అర్హత పొందిన వారు ఎవరూ లేరా? అని రేవంత్ ప్రశ్నించారు.

ధరణి పోర్టల్ లో....
తెలంగాణకు చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు అన్యాయం చేస్తున్నారన్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ధరణి పోర్టల్ లో లోపాల వల్లనే భూ వివాదాలు చోటు చేసుకుంటున్నాయని రేవంత్ ఆరోపించారు. నిన్న జరిగిన రియల్టర్ల హత్యలు కూడా ఈ కోణంలోనే చూడాలన్నారు రేవంత్ రెడ్డి. ఈ హత్యల్లో సుపారీ గ్యాంగ్ ఉందన్న ఆరోపణలున్నాయిన్నారు. బీహార్ గ్యాంగ్ ను అడ్డంపెట్టుకుని కేసీఆర్ పాలన చేస్తున్నారని, బీహార్ కు చెందిన వ్యూహకర్తను కూడా అందుకే తెచ్చుకున్నారన్నారు.


Tags:    

Similar News