Kalavakuntla Kavitha : నేడు కల్వకుంట్ల కవిత కీలక ప్రకటన
బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ కు గురయిన కల్వకుంట్ల కవిత నేడు మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు.
బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ కు గురయిన కల్వకుంట్ల కవిత నేడు మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. తన భవిష్యత్ ప్రణాళికను ప్రకటించనున్నారు. కవితను బీఆర్ఎస్ నాయకత్వం సస్పెండ్ చేయడంతో నిన్నంతా తన సన్నిహితులు, మిత్రులతో కల్వకుంట్ల కవిత చర్చించారు. ఈరోజు తనకు నోటీసులు ఇవ్వకుండానే, తన వివరణ తీసుకోకుండానే సస్పెన్షన్ వేటు వేయడంపై కల్వకుంట్ల కవిత అభ్యంతరం చెప్పే అవకాశాలున్నాయి.
కార్యాచరణపై...
అదే సమయంలో తన భవిష్యత్ కార్యాచరణను కూడా కల్వకుంట్ల కవిత నేటి మీడియా సమావేశంలో ప్రకటించే అవకాశముంది. కొత్త పార్టీ పెడతారా? తాను రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారన్న దానిపై నేడు క్లారిటీ ఇచ్చే అవకాశముంది. ఇప్పటికిప్పుడు కొత్త పార్టీ విషయం ప్రస్తావించకపోయినా జనంలోకి వెళ్లే దానిపై మాత్రం కవిత కార్యాచరణను ప్రకటించనున్నారని తెలిసింది.