Kavitha : కవిత గోల్ అదేనా? ఒక్కసారి అందరికీ షాక్ ఇవ్వనున్నారా?

కల్వకుంట్ల కవితను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయడంతో భవిష్యత్ కార్యాచరణపై ఆమె తన సన్నిహితులతో చర్చించినట్లు తెలిసింది

Update: 2025-10-13 12:52 GMT

కల్వకుంట్ల కవితను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయడంతో భవిష్యత్ కార్యాచరణపై ఆమె తన సన్నిహితులతో చర్చించినట్లు తెలిసింది. తనను బీఆర్ఎస్ లోకి తిరిగి తీసుకోవాలని ప్రయత్నించినా తాను చేరబోనని ప్రకటించిన కవిత ప్రస్తుతం పూర్తి స్థాయి జాగృతి నేతగా మారిపోయారు. ఎమ్మెల్సీ పదవికి చేసిన రాజీనామాను ఆమోదించినా ఆమోదించకపోయినా ఆ పదవి లేనట్లుగానే ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ జాగృతిని బలోపేతం చేసుకునేందుకు కార్యవర్గాన్ని నియమించుకుంటూ వెళుతును్నారు. . జిల్లాల వారీగా క్షేత్రస్థాయిలో క్యాడర్ ను రెడీ చేసుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకూ ఆమె జాగృతిని రాజకీయ పార్టీగా ప్రకటించలేదు. అలాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోటీకి కూడా దూరంగా ఉన్నట్లు కనపడుతుంది.

ఎన్నికల్లో పోటీ చేయడానికి...
తెలంగాణ జాగృతిలో ముఖ్యమైన నాయకులు ఎన్నికల కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. తెలంగాణ జాగృతి నుంచి పోటీ చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవవచ్చని వారు అంచనా వేసుకుని కవిత వెంట తిరుగుతున్నారు. అదే సమయంలో తెలంగాణ జాగృతి సంస్థలో పదవులన్నింటినీ మైనార్టీలు, గిరిజనులకే కేటాయిస్తున్నారు. ప్రధాన పదవుల్లో వారినే నియమిస్తుండటంతో కవిత లక్ష్యం వేరేలా ఉందా? అన్న సందేహం తలెత్తుతుంది. ఇంత కాలం వారికి ఏ పార్టీలోనూ రాజకీయ ప్రాధాన్యత దక్కడంలేదని అంటున్నారు. అందుకే తాను ప్రాధాన్యం ఇస్తున్నానని కవిత చెబుతున్నప్పటికీ బీసీ రిజర్వేషన్ల ఉద్యమం కోసం తాను పని చేస్తానని కల్వకుంట్ల కవిత పదే పదే ప్రకటించుకుంటున్నారు.
ఉద్యమ సంస్థగానే...
అయితే తెలంగాణ జాగృతి సంస్థను కేవలం ఉద్యమ సంస్థగానే ఉంచుతారా? రాజకీయ పార్టీగా ప్రకటిస్తారా? అన్న చర్చ వారి అనుచరుల్లో ప్రారంభమయింది. ఇప్పటి వరకూ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు చేస్తున్నారే తప్పించి బీఆర్ఎస్ నాయకత్వంపై మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. అలాగని గత కొద్ది రోజుల నుంచి హరీశ్ రావు, సంతోష్ రావు వంటి వారిపై కూడా విమర్శలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ విషయాలన్నీ బేరీజు వేసుకుని కల్వకుంట్ల కవితకు తిరిగి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నుంచి పిలుపు వచ్చే అవకాశముందని అంటున్నారు. రాజకీయ పార్టీగా ప్రకటించి ఉంటే కల్వకుంట్ల కవితపై కొంత నమ్మకం ఉండేదని, అలా కాకుండా ఇంకా ఉద్యమ సంస్థగానే ఉంచడంతో బీఆర్ఎస్ వ్యూహంలో భాగంగానే జరుగుతుందా? అన్న అనుమానాలు మాత్రం అందరిలోనూ కలుగుతున్నాయి.


Tags:    

Similar News