Telangana : నేటి నుంచి కవిత జిల్లాల యాత్ర

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నేటి నుంచి జిల్లాల యాత్రను ప్రారంభించనున్నారు

Update: 2025-10-25 03:54 GMT

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నేటి నుంచి జిల్లాల యాత్రను ప్రారంభించనున్నారు. సామాజిక తెలంగాణ లక్ష్యంగా కవిత ఈ యాత్రను ప్రారంభించనున్నారు. మొత్తం ముప్ఫయి మూడు జిల్లాల్లో ఈ యాత్ర కొనసాగుతుంది. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన కల్వకుంట్ల కవిత తతాను సొంతంగా ఈ యాత్రను చేపట్టారు. కేసీఆర్ ఫొటో లేకుండా ఈ యాత్రను కవిత చేపడుతున్నారు. నిజామాబాద్ జిల్లా నుంచి కల్వకుంట్ల కవిత ఈ యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు.

నిజామాబాద్ నుంచి...
ఈరోజు ఉదయం గన్ పార్క్ లో నివాళులర్పించిన అనంతరం నిజామాబాద్ కు కవిత బయలుదేరి వెళ్లి అక్కడి నుంచి యాత్రను ప్రారంభిస్తారు. త్వరలో కొత్త పార్టీ ప్రకటించే లక్ష్యంతో కల్వకుంట్ల కవిత తొలుత యాత్రను చేపట్టి ప్రజల వద్దకు వెళ్లి వారిని కలిసిన అనంతరం పార్టీని ప్రకటించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. కవిత యాత్ర కోసం ఇప్పటికే జాగృతి అన్ని ఏర్పాట్లు చేసింది.


Tags:    

Similar News