నేటి నుంచి కాకతీయ ఉత్సవాలు
నేటి నుంచి కాకతీయ వైభవ సప్తాహాన్ని నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంది.
నేటి నుంచి కాకతీయ వైభవ సప్తాహాన్ని నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంది. కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. మొత్తం ఏడు రోజుల పాటు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని ఉత్సవ కమిటీ తెలిపింది.
ప్రత్యేక అతిధిగా...
ఈ ఉత్సవాలకు ప్రత్యేకంగా కాకతీయ 22వ తరం వారసుడైన కమల్ చంద్ర భంజ్‌దేవ్ రానున్నారు. ముఖ్య అతిధిగా పాల్గొననున్నారు. ఛత్తీస్‌ఘడ్ లోని బస్తర్ నుంచి ఆయన వరంగల్ కు రానున్నారు. కాకతీయ సమ్మేళనం సందర్భంగా కవి సమ్మేళనాలు, వక్తృత్వ, వ్యాసరచన పోటీలను నిర్వహించనున్నారు.