Maganti Gopinath: ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్యంపై వదంతులు నమ్మకండి
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కు గుండెపోటు రావడంతో
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కు గుండెపోటు రావడంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. మరో 48 గంటలు మాగంటి గోపీనాథ్ వైద్యుల పర్యవేక్షణలో ఉంటారని, మాగంటి త్వరగా కోలుకుని త్వరలోనే ప్రజా జీవితంలోకి వస్తారని ఆశిస్తున్నానని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు.
ఆయన ఈ సంవత్సరం ప్రారంభంలో మూత్రపిండాల సంబంధిత వ్యాధుల కారణంగా ఆసుపత్రిలో చేరారు. మాగంటి ఆరోగ్యంపై ఎవరూ మానసిక ఆందోళనకు గురికావద్దని, మీడియా తప్పుడు సమాచారని అందించవద్దని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కోరారు. మాగంటి గోపీనాథ్ కోలుకుంటున్నారని, ఇప్పటివరకూ ఆయనకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. వైద్యానికి స్పందిస్తున్నారని.. ఇటీవల జరిగిన కొన్ని పరిస్థితుల వల్ల మాగంటి గోపీనాథ్ కొంత ఒత్తిడికి గురయ్యారని తెలిపారు.