దావోస్ లో తెలంగాణకు భారీ పెట్టుబడులు

దావోస్ లో తెలంగాణకు పెట్టుబడులు పెరుగుతున్నాయి

Update: 2026-01-22 12:02 GMT

దావోస్ లో తెలంగాణకు పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు 20 వేల కోట్లకు పైగా ఒప్పందాలు చేసుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం రష్మీ గ్రూప్ తో 12,500 కోట్ల రూపాయల భారీ డీల్ ను కుదుర్చుకుంది. మూసి పునర్జీవనంలో టాటా భాగస్వామ్యం కావాలని చర్చించింది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డితో భేటీలో చంద్రశేఖరన్ ఆసక్తి చూపారు. హైదరాబాదులో స్టేడియాల అప్గ్రేడేషన్ ,పర్యాటక రంగంలో టాటా పెట్టుబడులు పెడతామని తెలిపారు. క్లీన్ ఎనర్జీలో సరికొత్త విప్లవం వస్తుందని చెప్పారు.

టాటా గ్రూపు సంస్థతో...
ఆరువేల కోట్ల రూపాయలతో మాడ్యులర్ రియాక్టర్ విద్యుత్ ప్రాజెక్ట్ ఏవియేషన్ రంగంలో 1000 కోట్ల పెట్టుబడి సర్గాడ్ సంస్థతో తెలంగాణ సర్కారు అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దావోస్ టూర్ లో వార్డ్ రాష్ట్ర సీఎం క్రిస్టల్ లూసియార్ తో ముఖ్యమంత్రి రెడ్డి బృందం భేటీ అయింది. హైదరాబాదులో స్విస్ మాల్ ఏర్పాటు చేయాలని క్రిస్టల్ లూసియార్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. హాస్పిటాలిటీ రిటైల్ రంగాల్లో స్విస్ నైపుణ్యాల వినియోగం, భారత్ స్విస్ వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య సమన్వయం వంటి వాటిపై చర్చించారు.


Tags:    

Similar News