నేడు యాదగిరిగుట్టకు రేవంత్ రెడ్డి

నేడు యాదగిరిగుట్ట స్వర్ణ విమాన గోపురం ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు

Update: 2025-02-23 03:21 GMT

నేడు యాదగిరిగుట్ట స్వర్ణ విమాన గోపురం ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది. పవిత్ర నదీ జలాలతో మహాకుంభాభిషేకం నిర్వహిస్తున్నారు. ఉదయం 11.54 గంటలకు మూలా నక్షత్రం వృషభ లగ్నం ముహూర్తాన బంగారు విమాన గోపురం ఆవిష్కరణ జరుగుతుంది. 68 కిలోల బంగారం తో తాపడం పనులను యాదగిరి లక్ష్మీనరసింహస్వామి గోపురానికి చేయించారు.

స్వర్ణ విమాన గోపురం...
స్వర్ణ విమాన గోపురం ఆవిష్కరణ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఆలయ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కూడా కోరారు. ఆహ్వాన లేఖను కూడా అందచేశారు. ఆదివారం కావడంతో యాదగిరిగుట్టలో అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చే అవకాశముంది. దీంతో ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.


Tags:    

Similar News