Telangana : తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ నేడు
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ నేడు జరగనుంది. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఆవిష్కరించనుంది
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ నేడు జరగనుంది. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఆవిష్కరించనుంది. ఇందుకోసం ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించింది. కొన్ని రోజుల నుంచి సచివాలయం వద్ద పనులు జరుగుతున్నాయి. సచివాలయం వద్ద జరిగే తెలంగాణ తల్లి ఆవిష్కరణ కార్కక్రమానికి పార్టీ జాతీయ నేతలు కూడా హాజరయ్యే అవకాశముందని తెలిసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
విగ్రహావిష్కరణను...
ఈ విగ్రహావిష్కరణకు ఢిల్లీ నుంచి కొందరు కాంగ్రెస్ నేతలు హాజరయ్యే అవకాశముంది. అదే సమయంలో విగ్రహావిష్కరణను నిరుపేద మహిళల చేత చేయించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లను కూడా తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానించింది. పెద్దయెత్తున జరిగే ఈ కార్యక్రమం సచివాలయం వద్ద సాయంత్రం నాలుగు గంటల సమయంలో జరగనుంది.