ఇక హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయ్‌

తెలంగాణ రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందని, తెలంగాణలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి..

Update: 2023-08-19 07:30 GMT

తెలంగాణ రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందని, తెలంగాణలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. శనివారం నగరంలోని వీఎస్టీ నుంచి ఇందిరా పార్క్‌ వరకు నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జిని ఐటీ ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. నగర వాసులకు ట్రాఫిక్‌ కష్టాలు తీర్చేందుకు మరో వంతెన అందుబాటులోకి వచ్చిందన్నారు. 2.25 కిలోమీటర్లు ఉన్న ఫోర్ లైన్ స్టీల్‌ బ్రిడ్జికి మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి పేరు పెట్టామని, ఆయన కుటుంబ సభ్యులు కూడా సంతోషంగా ఉన్నారన్నారు. వంతెన నిర్మాణానికి దాదాపు 450 కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించారు. వంతెన అందుబాటులోకి రావడంతో వీఎస్‌టీ జంక్షన్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ఇందిరాపార్క్ క్రాస్‌రోడ్డులో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయని మంత్రి పేర్కొన్నారు. నగరంలో ట్రాఫిక్‌ కష్టాలు తీర్చేందుకు ఎన్నో వంతెనలు, సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తున్నామని,

సీఎం కేసీఆర్‌ ప్రజల కోసం ఆహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. ఈ స్టీల్ బ్రిడ్జి నిర్మించిన మార్గంలో రోజు లక్ష వాహనాలు నడుస్తూ రాకపోకలు కొనసాగిస్తుంటాయి. సాధారణంగా తెలుగుతల్లి ఫ్లై ఓవర్ మీద నుంచి వచ్చే వాహనాలు ఓయూ, నల్లకుంట వెైపు వెళ్లాలంటే 30 నుంచి 40 నిమిషాల సమయం పడుతుంది. అయితే ఈ బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో సమయం మరింతగా తగ్గనుంది. స్టీల్ బ్రిడ్జి నిర్మాణంతో లోయర్ ట్యాంక్ బండ్ నుంచి వీఎస్టీ వరకు కేవలం ఐదు నిమిషాల్లో వెళ్లే అవకాశం ఉంటుంది. అంటే అరగంట ప్రయాణంలో 25 నిమిషాల సమయం ఆదా చేసుకునే విధంగా ఉంటుంది. ఈ వంతెన అందుబాటులోకి రావడంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి పేరు పెట్టడంతో కుటుంబ సభ్యులు కేసీఆర్‌ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

Tags:    

Similar News