Telangana : దావోస్ వేదికగా తెలంగాణకు భారీ పెట్టుబడులు

దావోస్ వేదికగా తెలంగాణకు భారీ పెట్టుబడులు కుదురుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం ఈ మేరకు వివిధ సంస్థలతో ఒప్పందాలను కుదుర్చుకుంటుంది.

Update: 2025-01-22 02:28 GMT

దావోస్ వేదికగా తెలంగాణకు భారీ పెట్టుబడులు కుదురుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం ఈ మేరకు వివిధ సంస్థలతో ఒప్పందాలను కుదుర్చుకుంటుంది. పదిహేను వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు హెగా ఇంజినీరింగ్ సంస్థ ముందుకు వచ్చింది. ఈ మేరకు సంస్థ ప్రతినిధులతో ఒప్పందం కుదిరింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరుపున, మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ ప్రతినిధులు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి.

పదిహేను వేల కోట్లతో...
పదిహేను వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు మేఘా ఇంజినీరింగ్ సంస్థ ముందుకు వచ్చింది. ఆధునిక పంప్ స్టోరేజీ విద్యుత్తు బ్యాటరీ శక్తి నిల్వ వ్యవస్థతో పాటుగా, ప్రపంచ స్థాయి వెల్ నెస్ రిసార్ట్ ను అనంతగిరి కొండల్లో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. పదిహేను వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించింది. అలాగే ఐదు వందల కోట్ల ప్రయివేట్ రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్, టెస్టింగ్ యూనిట్ ఏర్పాటుకు స్కై రూట్ కంపెనీ ముందుకు వచ్చనట్లు రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.


Tags:    

Similar News