Telangana : తెలంగాణ గ్రూప్ 1 నియామకాలపై హైకోర్టు స్టే

తెలంగాణ గ్రూప్ 1 నియామకాలపై హైకోర్టు స్టే విధించింది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది

Update: 2025-04-17 13:01 GMT

తెలంగాణ గ్రూప్ 1 నియామకాలపై హైకోర్టు స్టే విధించింది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్ 1 నియామకాలను నిలిపి వేయాలంటూ కొందరు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన హైకోర్టు విచారణ ముగిసేంత వరకూ ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వవద్దని పేర్కొంది.

వెరిఫికేషన్ మాత్రం...
ఈ కేసు విచారణ పూర్తయి తుది తీర్పు వెలువడేంత వరకూ నియామక పత్రాలను ఇవ్వవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అయితే ఈ నియామకాలకు సంబంధించిన సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రక్రియను మాత్రం కొనసాగించవచ్చని పేర్కొంది. దీంతో గ్రూప్ వన్ నియామకాలకు హైకోర్టు తాత్కాలింగా బ్రేక్ వేసినట్లయింది.


Tags:    

Similar News